ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచావా జగనన్నా - ఏడో రోజు కొనసాగుతున్న ఎస్​ఎస్​ఏ ఉద్యోగుల సమ్మె

7th Day of Samagra Siksha Abhiyaan Employees Protest: ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఏపీ సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఏడో రోజు సమ్మె కొనసాగించారు. తాము సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే అధికారులు వేతనంలో కోత విధిస్తామని చెప్పడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్​సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

7th_Day_of_Samagra_Siksha_Abhiyaan_Employees_Protest
7th_Day_of_Samagra_Siksha_Abhiyaan_Employees_Protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 5:46 PM IST

7th Day of Samagra Siksha Abhiyaan Employees Protest: గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం శోచనీయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ధ్వజమెత్తారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలియజేస్తోందన్నారు.సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏడో రోజు సమ్మె కొనసాగించారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచావా జగనన్నా - ఏడో రోజు కొనసాగుతున్న ఎస్​ఎస్​ఏ ఉద్యోగుల సమ్మె

SSA EmployeesProtest in Anantapur: అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. సమగ్ర శిక్షణ మెసెంజర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వదిలి, న్యాయం చేసి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అక్కడే బైఠాయించారు.

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టారు. జగన్ అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చిరుద్యోగులు ఎంతో ఆశపడ్డారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. హామీలు మరిచావా జగనన్న అంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. ఉద్యోగుల నిరసనకు ఏపీటీఎఫ్, యూటీఎఫ్ సంఘాలు మద్దతు తెలిపాయి.

"పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి జగనన్నా. సర్వ శిక్షా ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. నాలుగు నెలల నుంచి సరిగ్గా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి." - ఎస్ఎస్ఏ ఉద్యోగి

SSA EmployeesProtest in Vijayanagaram:విజయనగరం కలెక్టరేట్ వద్ద సర్వశిక్ష ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, వేపాడ చిరంజీవులు సంఘీభావం తెలిపారు. సీఎం నియంతృత్వ ధోరణి వీడాలని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని అన్నారు. కాకినాడలో ధర్నా చౌక్ వద్ద పాటలు పాడుతూ సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

విజయవాడ ధర్నా చౌక్ సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె కొనసాగించారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే అధికారులు వేతనంలో కోత విధిస్తామని చెప్పడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు, నెల్లూరు కలెక్టరేట్ల వద్ద బిక్షాటన చేసి నిరసన తెలిపారు. పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారని, పదవి రాగానే జగన్‌ అన్నీ మరిచిపోయారని విమర్శించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉద్యోగులు ప్రధాన రహదారిపై ఖాళీ కంచాలతో మోత మోగిస్తూ, భిక్షాటన చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details