Young man made a Riot: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల సచివాలయంలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. సచివాలయంలో రెండు కంప్యూటర్లు, ప్రింటర్లను ధ్వంసం చేశాడు. సిబ్బందిపై దౌర్జన్యం చేయడమే కాక తిరిగి వారిపై ఫిర్యాదు చేసేందుకు ముప్పాళ్ల పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. పోలీసుస్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. రూల్స్ తెలుసా మీడియాను పిలుస్తానంటూ మహిళ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేశాడు. ఘటనలో మహిళా కానిస్టేబుల్ ప్రతిఘటించి ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది. నిందితుడు వైకాపా ముప్పాళ్ల వార్డు మెంబర్ కొడుకు కోటిరెడ్డిగా సచివాలయం సిబ్బంది తెలిపారు. సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో... పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు యువకుడు కోటిరెడ్డిపై ముప్పాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్రామ సచివాలయంలో రెచ్చిపోయిన యువకుడు.. మహిళా కానిస్టేబుల్‌తోనూ - మహిళా కానిస్టేబుల్‌పై యువకుడు హల్చల్
Young man made a Riot: ముప్పాళ్ల గ్రామ సచివాలయంలో యువకుడు హల్చల్ చేశాడు. గ్రామ సచివాలయంలో సామగ్రిని ధ్వంసం చేశాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహిళా కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. అసలేం జరిగిందంటే..?
యువకుడి హల్చల్
Last Updated : Sep 11, 2022, 3:57 PM IST