woman complained to SP పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఓ వివాహిత తనను ముగ్గురు వ్యక్తులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ.. నరసరావుపేట ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. వరుసకు బావలైన.. మానుపాటి వెంకటేశ్వర్లు, ఆంజనేయులతో పాటు కేశవరెడ్డి వేధిసున్నారని బాధిత మహిళ ఆరోపించింది. మాచర్ల పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వైకాపా అండదండలున్నాయని చెబుతూ.. వేధిస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. తనకు సహకరించిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారంటూ వాపోయింది. తనకు రక్షణ కల్పించి కాపాడాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు మహిళ వివరించింది.
ముగ్గురు వ్యక్తులు వేధిస్తున్నారు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఎస్పీకి ఫిర్యాదు - వివాహిత
woman complaint of harassment తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ వివాహిత ఎస్పీని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తనను ముగ్గురు వ్యక్తులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమకు వైకాపా అండదండలున్నాయని వేధిస్తున్న వ్యక్తులు బెదిరిస్తున్నారంటూ మహిళ వాపోయింది.
వివాహిత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
Last Updated : Aug 16, 2022, 7:11 PM IST