Tension in Yuvagalam: వినుకొండ టీడీపీ యువగళంలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే బొల్లా ఆగ్రహం - TDP Yuvagalam program live
16:27 May 15
టీడీపీ కార్యకర్తలపై మండిపడ్డ బొల్లా బ్రహ్మనాయుడు
Tension in Yuvagalam: లోకేశ్ యువగళం వంద రోజుల పాదయాత్రకు సంఘీభావంగా.. పల్నాడు జిల్లా శావల్యపురంలో తెదేపా శ్రేణులు నిర్వహించిన పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో వినుకొండ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శావల్యపురం కనకదుర్గమ్మ దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. ఆలయంలో పూజలు అనంతరం బయటకు వస్తున్న తరుణంలో.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అటువైపుగా వచ్చారు. ఎమ్మెల్యే వాహనం చూసి.. తెదేపా శ్రేణులు జీవి ఆంజనేయులకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ తరుణంలో ఆగ్రహించిన ఎమ్మెల్యే కారు దిగి తెదేపా కార్యకర్తలపై దుర్భాషలాడారు. మీసం తిప్పుతూ రండి చూసుకుందాం అంటూ రెచ్చగొట్టారు. ఆగ్రహించిన తెదేపా శ్రేణులు మా నాయకుడికి జిందాబాద్ కొడితే నీకేంటి అంటూ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేని అక్కడ నుంచి పంపించేసి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇవీ చదవండి