ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో ఇబ్రహీం హత్య.. శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనం:చంద్రబాబు

TDP ON NARASARAOPETA MURDER: మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న ముస్లిం నేతను అత్యంత కిరాతకంగా హతమార్చాడం జగన్​ పాలనకు పరాకాష్ట అని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

TDP LEADERS ON NARASARAOPETA MURDER
TDP LEADERS ON NARASARAOPETA MURDER

By

Published : Dec 21, 2022, 2:12 PM IST

TDP LEADERS ON NARASARAOPETA MURDER : నరసరావుపేటలో ముస్లిం నేత ఇబ్రహీం హత్య.. శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పల్నాడును ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ హత్యాకాండ ఎందుకో.. సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా అసమర్థ ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటన జగన్​ పాలనకు పరాకాష్ట: ముస్లిం మైనారిటీలను అంతమొందించేందుకే జగన్ సీఎం అయినట్టుందంటూ నారా లోకేశ్‌ మండిపడ్డారు. మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న టీడీపీ నేత ఇబ్రహీంను నరసరావుపేటలో అత్యంత కిరాతకంగా హత్య చేయడం జగన్ పాలనకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన మరో కార్యకర్త అలీ పరిస్థితి విషమంగా ఉందన్నారు.

వైసీపీ వచ్చాక రాష్ట్రంలో మైనార్టీల ఊచకోత: ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే, అతడి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఇబ్రహీం, రహమత్ అలీ తన దగ్గరకు వచ్చి చెప్పారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details