ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం.. - పల్నాడు జిల్లా తాజా వార్తలు

TDP leaders clash: ఒకే పార్టీకి చెందిన వర్గంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పార్టీ ఫ్లెక్సీలు కత్తిరించారని ఒకే పార్టీకి చెందిన ఇరు నాయకుల వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

తెదేపా నాయకుల వాగ్వాదం
tdp-leaders-clash

By

Published : Oct 29, 2022, 10:16 PM IST

TDP leaders clash: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఫ్లెక్సీల చించివేత.. తెలుగుదేశం నాయకుల మధ్య వివాదానికి కారణమైంది. గత రాత్రి ఎన్టీఆర్ భవన్ వద్ద తెదేపా నాయకులు.. కోడెల శివరాం, మాజీ తెదేపా ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించారు. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఫ్లెక్సీలు చించివేతకు మీరంటే మీరే కారణమంటూ.. ఎన్టీఆర్​ భవన్​లో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాలు మధ్య తోపులాట జరిగింది. పరస్పరం ఒకరినొకరు దూషించుకున్నారు. ప్రమాణానికి సిద్ధమంటూ.. ఇరువర్గాల నాయకులు తోపులాటకు దిగడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details