ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pulichintala project పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Pulichintala project పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ఇన్‌ఫ్లో 3.69, ఔట్‌ఫ్లో 3.44 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ దిగువన నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Pulichintala project
పులిచింతల ప్రాజెక్టు

By

Published : Aug 14, 2022, 11:30 AM IST

Pulichintala project: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 13 గేట్లు ఎత్తి 3.44 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువున నాగార్జున సాగర్ నుంచి 3.69 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ దిగువన నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పులిచింతల ప్రాజెక్టు

ABOUT THE AUTHOR

...view details