GV Anjaneyulu Wrote Letter To The Palnadu SP: పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టీడీపీ నేతలకు భద్రత కల్పించాలని పల్నాడు ఎస్పీకి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు లేఖ రాశారు. మాచర్ల అల్లర్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన బ్రహ్మారెడ్డికి హైకోర్టు కండీషన్ బెయిల్ జారీ చేసింది. బ్రహ్మారెడ్డితో పాటు మరో 22 మందికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం మాచర్ల పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టేందుకు 23 మంది టీడీపీ నేతలు రానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు మాచర్ల వెళ్లేందుకు జీవీ ఆంజనేయులు అనుమతి కోరారు. ప్రస్తుతం మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. బ్రహ్మారెడ్డి ప్రాణానికి భద్రత కల్పించాలని లేఖలో తెలిపారు.
మాచర్ల టీడీపీ ఇన్చార్జి బ్రహ్మారెడ్డి భద్రతపై ఎస్పీకి లేఖ - మాచర్ల టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మా రెడ్డి
GV Anjaneyulu Wrote Letter To The Palnadu SP: పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టీడీపీ నేతలకు భద్రత కల్పించాలని పల్నాడు ఎస్పీకి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు లేఖ రాశారు. బ్రహ్మారెడ్డి ప్రాణానికి భద్రత కల్పించాలని లేఖలో తెలిపారు.
Etv Bharat