ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్​ మాట్లాడుతున్న కుమార్తె.. మేడ పైనుంచి తోసేసిన తండ్రి - ap crime news

Father Throws her Daughter from the Terrace: అనుమానం.. ప్రశాంతంగా ఉన్న జీవితాలను తలకిందులు చేసింది. ఇంటర్ చదువుతున్న అయ్యాయి ఇంటి మేడ మీద ఫోన్ మాట్లాడుతోంది. ఎవరితో మాట్లాడుతుందో కూడా తెలియదు. కానీ అనుమానంతో.. తండ్రి కుమార్తెను మేడ పైనుంచి కిందకి తోసేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.

Father Throws her Daughter from the Terrace
కుమార్తెను మేడపై నుంచి తోసేసిన తండ్రి

By

Published : Feb 10, 2023, 3:18 PM IST

Father Throws her Daughter from the Terrace: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోని ఉదయపూర్ ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సెల్​ఫోన్ మాట్లాడుతున్న కుమార్తెను అనుమానంతో మేడ పైనుంచి కిందకి తోసేశాడు ఓ తండ్రి. దీంతో తీవ్ర గాయాలైన ఆ అమ్మాయి.. కోమాలోకి వెళ్లింది.

దీనిపై కేసు నమోదు చేసి.. వివరాలను పోలీసులు వెల్లడించారు. ఉన్నవ గ్రామానికి చెందిన కూరాకుల కావ్య గణపవరం సీఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈనెల 8వ తేదీన ఇంటి మేడపై కావ్య సెల్ ఫోన్​లో మాట్లాడుతున్న సమయంలో గమనించిన తండ్రి వరప్రసాద్.. కుమార్తె ఎవరో యువకుడితో మాట్లాడుతుందని అనుమానించి మేడపై నుంచి కిందకు తోసేశాడు.

తీవ్ర గాయాలైన కావ్యను హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కావ్య పరిస్థితి విషమంగా ఉంది. కోమాలోకి వెళ్లటంతో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వరప్రసాద్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details