పల్నాడు జిల్లా అమరావతి యూనియన్ బ్యాంకు శాఖలో సహాయ మేనేజర్‌పై డ్వాక్రా యానిమేటర్ దాడికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. డ్వాక్రా యానిమేటర్ అమృత వేణి నగదు ఉపసంహరణకు బ్యాంకుకు వెళ్లింది. నగదు ఉపసంహరణకు బ్యాంకు ముద్ర వేయించుకురావాలని సహాయ మేనేజర్ ప్రభుదాస్ ఆమెకు సూచించాడు. దీంతో సహాయ మేనేజర్‌తో అమృతవేణి వాగ్వాదానికి దిగింది. తన బంధువులను అక్కడకు పిలిపించి ప్రభుదాస్‌పై చేయి చేసుకున్నారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
బ్యాంకు సహాయ మేనేజర్‌పై డ్వాక్రా యానిమేటర్ దాడి - బ్యాంకు సహాయ మేనేజర్‌పై డ్వాక్రా యానిమేటర్ దాడి వార్తలు
Attack on Bank Employee: యూనియన్ బ్యాంకు సహాయ మేనేజర్‌పై డ్వాక్రా మేనేజర్ దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా అమరావతిలో చోటు చేసుకుంది. దాడి ఘటనపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బ్యాంకు సహాయ మేనేజర్‌పై డ్వాక్రా యానిమేటర్ దాడి
బ్యాంకు సిబ్బంది ఆందోళన..: బ్యాంకు సహాజ మేనేజర్ ప్రభుదాస్‌పై యానిమేటర్ దాడిని నిరసిస్తూ..బ్యాంకు వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అనంతరం అమరావతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుకోవాలని పోలీసులకు వినతిపత్రం అందజేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి