CBN precautions on Mandous Cyclone: మాండౌస్ తుఫాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని ప్రజలకు చేరవేసి వారిని అప్రమత్తం చెయ్యాలని సూచించారు. అవసరం మేరకు వసతులతో సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. తుఫాను ప్రభావంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్న చంద్రబాబు...,ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు చేయూత అందించాలనని కోరారు. రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. మాండౌస్ తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
మాండౌస్ తుఫాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి: చంద్రబాబు - CBN precaution on Mandous Cyclone
CBN precautions on Mandous Cyclone: మాండౌస్ తుఫాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మాండౌస్ తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు