ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మతిస్థిమితం లేని మహిళ రోడ్డుపక్కన ప్రసవం.. 108 సిబ్బంది ఏం చేశారంటే? - పల్నాడు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

మతిస్థిమితం లేని మహిళ రోడ్డు పక్కన చెట్టు కింద బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.

108 personnel spread humanity
మానవత్వం చాటిన 108 సిబ్బంది

By

Published : Apr 16, 2022, 2:49 PM IST

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం నుంచి మండలంలోని వేలూరు వెళ్లే మార్గంలో కాలనీ సమీపంలో మతిస్థిమితం లేని ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓ కంప చెట్టుకింద తల్లి బిడ్డ ఉన్న విషయాన్ని చూసిన స్థానికులు 108కి సమాచారం అందించారు. స్పందించిన చిలకలూరిపేట 108 సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తల్లీ బిడ్డను అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో స్పందించి మానవత్వాన్ని చాటిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి:పెళ్లి బృందాన్ని వెంబడించిన ఇద్దరు ఆకతాయిలకు దేహశుద్ధి

ABOUT THE AUTHOR

...view details