YSRCP Government Did Not Fund the Drinking Water Schemes :జలాశయాల నుంచి నీటిని పైపులైన్లు, కాలువల ద్వారా తాగునీటి పథకాలకు సరఫరా చేస్తే గ్రామాల్లో దాహార్తి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 2022 మే 3న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశాలు, బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్ చెప్పే గొప్పలకు లోటు ఏమీ ఉండదు. కానీ ఆచరణలో మాత్రం ఏదీ జరగదు.
Drinking Water Schemes in AP : గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా రూపొందిస్తున్న భారీ పథకాలు నీరుగారిపోతున్నాయి. ఏళ్లు గడిచినా నిధుల కేటాయింపు లేక నీరసపడిపోతున్నాయి. ఫలితంగా సర్వేలు, డిజైన్ల తయారీ పేరుతో కాలయాపనకు తోడు పనులు శంకుస్థాపనలకే పరిమితమై ఇంటింటికీ తాగునీటి వసతి అటుంచి దాహార్తి తప్పని పరిస్థితి నెలకొంది.
Drinking Water Problems in AP : ఈ ఏడాది వేసవిలో మొదలైన తాగునీటి ఎద్దడి సమస్య ఇప్పటికీ అనేక జిల్లాల్లో కొనసాగుతోంది. తాగునీరు అందించండి మహా ప్రభో అంటూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిధులివ్వకుండా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసిన గుత్తేదారులకే బిల్లులు సరిగా చెల్లించని జగన్ ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందంటే ప్రజలు ఎలా నమ్మగలరు.
Drinking Water Problems in West Godavari District: ప్రతిపక్షంలో హామీలిచ్చారు.. అధికారంలోకి వచ్చాక అమలు మరిచారు
CM Jagan Neglect the Water Grid Project :జగన్ ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి 2019 అక్టోబరులో 46 వేల 6వందల 75 కోట్ల రూపాయల అంచనాలతో మొదట వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. పోలవరం, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టుల నుంచి తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా నీరు అందించేలా ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రూపొందించారు. తొలి దశలో 37 వేల 4 వందల 75 కోట్లు, రెండో దశలో మరో 9 వేల 2 వందల కోట్లు అవసరమని అంచనా వేశారు.