ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

IMD: స్థిరంగా కొనసాగుతున్న సితరంగ్‌ తుపాను.. - Weather Information of AP

Cyclone Sitrang: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సితరంగ్‌ స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ బంగాల్ తీరప్రాంతాల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

IMD
బంగాళాఖాతంలో తుపాను

By

Published : Oct 24, 2022, 2:42 PM IST

Weather information: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సితరంగ్‌ స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వెల్లడించింది. ప్రస్తుతం ఇది సాగర్ దీవికి 3వందల80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొందిం. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. రేపు ఉదయానికి బంగ్లాదేశ్ లోని.. టికోనా దీవికి సమీపంలో బరిసాల్ వద్ద తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. తుపాను సితరంగ్ ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని.. స్పష్టం చేసింది.తుపాను పరిసర ప్రాంతాల్లో 2.4 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ బంగాల్ తీరప్రాంతాల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details