Voters Angry Over Form-7 Applications : విజయనగరం జిల్లా దుప్పాడ పోలింగ్ పోలింగ్ బూత్ లో ఓట్లను అధికారులు పరిశీలించారు. చనిపోయిన వ్యక్తుల ఓట్లు, తప్పుడు ఓట్లపై పంచనామా చేసి తొలగిస్తామని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో ఉదయం 10 గంటల వరకు బీఎల్వోల జాడ లేదు. పలుచోట్ల బూత్‌ల వద్ద సిబ్బంది అరకొరగా హాజరయ్యారు. కనీస సౌకర్యాలు కల్పించక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. గుంటూరులో అక్రమంగా ఫాం-7 దరఖాస్తులు పెట్టిన వారిపై నియోజకవర్గ ఎన్నికల అధికారి నామమాత్రంగా కేసులు పెట్టి మమ అనిపించుకున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించారు. గుంటూరు పశ్చిమలో సుమారు 1800 వందల వరకు ఫారం-7 దరఖాస్తులు వైసీపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు నమోదు చేశారన్నారు.
'వైసీపీతో పెట్టుకుంటే ఓట్లు గల్లంతే' ఒకరి ఓటు తొలగించాలని మరొకరు దరఖాస్తు - ఉద్యోగులు, సామాన్య ఓటర్లు షాక్
Criticism of Form-7 Applications in Krishna District : కృష్ణా ఓటరు జాబితా పరిశీలన బృందం గన్నవరం మండలం కేసరపల్లి పోలింగ్ బూత్‌ను సందర్శించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పలుచోట్ల బీఎల్వోలు కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో కింద కూర్చుని పరిశీలించారు. తిరువూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు కొత్త ఓటు కోసం యువత నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో 1781 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ప్రత్యేక నమోదు ప్రక్రియ ప్రణాళికాయుతంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ దిల్లీరావు చెప్పారు.
అధికారపార్టీ ఓట్ల దొంగలను రక్షిస్తున్న పోలీసులు - అర్హుల ఓట్ల తొలగింపునకు వైసీపీ సానుభూతిపరుల దరఖాస్తులు
Form-7 Applications in Prakasam District : ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ముసాయిదా ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలన జరగ్గా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు హోరెత్తాయి. ఏళ్ల తరబడి గ్రామాల్లో ఉన్న వ్యక్తులు ఓట్లను తొలగించేందుకు వైసీపీ నాయకులు కొందరు ఫారం-7 దరఖాస్తు చేస్తుండటంతో అసలు ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు వచ్చి, మళ్లీ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అలాగే తిరుపతి జిల్లా వెంకటగిరిలో ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన విషయం తెలియక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు పోలింగ్ కేంద్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి పలువురు బూత్ స్ధాయి అధికారులు రాలేదు.
Lakhs of Voters Removed in Andhra Pradesh: లక్షల్లో ఓట్లు గల్లంతు.. వైసీపీ కుట్రలో భాగమేనా..!
Voters Angry Over Form-7 Applications : ఫిర్యాదులు వచ్చిన ఫామ్-7లలో ఈసీ కొన్ని తిరస్కరించవచ్చు మరికొన్నింటిని పరిగణలోకి తీసుకోవచ్చు. ఎన్నింటిని అంగీకరించారనే విషయం నమూనా ఓటర్ల జాబితా విడుదల చేసినప్పుడే తెలుస్తుంది. ఈలోపు వైసీపీ ఎన్ని కుట్రలకైనా తెగబడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గంపగుత్తుగా చేత్తో గాని, ఆన్‌లైన్ ద్వారా గాని అప్లికేషన్‌లు దాఖలు చేసినప్పుడు వాటిని తిరస్కరించే అధికారం ఈఆర్ఓకు ఉంది.
చనిపోయిన వారి విషయంలో మరణ ధృవీకరణ పత్రం జత చేయాలి లేదా బీఎల్ఓ పంచనామా చేసిన తర్వాత తొలగించాలి. చదువులు, ఉద్యోగాలు, కూలీ పనుల నిమిత్తం ఊరు వదిలి వెళ్లారనే కారణంతో ఓటును తీసేసే హక్కు ఎవరికీ లేదు. నోటీసు ఇవ్వకుండా ఫామ్-7 ద్వారా ఓటు తొలగించే హక్కు కూడా అధికారులకు లేదు.
ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు లక్ష్యంగా వైసీపీ అక్రమాలు- ఫేక్ ఓటరు ఐడీతో తొలగింపు
ఫామ్-7 తో భారీగా ఓట్ల గల్లంతు - ఏళ్ల తరబడి గ్రామాల్లో ఉన్న వ్యక్తుల ఓట్లు తొలగింపు