Vijayawada Railway DRM : విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైల్వే ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి.. రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విజయవాడ డీఆర్ఎం శివేంద్రమోహన్ అన్నారు. పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదన్నారు. డివిజన్ పరిధిలో పెండింగ్ పనులను వేగంగా చేపడుతున్నామన్న ఆయన.. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను వినియోగించుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను ఇస్తే పనులను మరింత వేగంగా పూర్తి చేస్తామని అన్నారు. ప్రయాణికుల రాకపోకలు, గూడ్స్ రవాణాతో విజయవాడ డివిజన్ గతేడాది కంటే ఎక్కువ ప్రగతి సాధించిందని అన్నారు.
ప్రాజెక్టులు పూర్తి కాకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : విజయవాడ రైల్వే డీఆర్ఎం - ap latest news
Vijayawada Railway DRM : విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి కాకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విజయవాడ డీఆర్ఎం అన్నారు. కేంద్రం కేటాయించిన నిధులను సక్రమంగా వాడుకుని పలు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు.
విజయవాడ డీఆర్ఎం శివేంద్రమోహన్
"రైల్వే పనుల్లో పురోగతి బాగుంది. పురోగతి చూపిన పనులకు నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం నిధులు ఇవ్వటం లేదు. దీని వల్ల మన డివిజన్ పరిధిలో పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి." -శివేంద్రమోహన్,విజయవాడ డీఆర్ఎం
ఇవీ చదవండి :