Tenant Farmers Union Leaders Protest For Irrigation Water In NTR District : అన్నాసాగర్ , శనగపాడు, నందిగామ గ్రామాల పరిధిలో నీరు లేక ఎండిపోతున్న మాగాణి, పత్తి, మిర్చి పంట పొలాలను పరిశీలించిన రైతు సంఘం నాయకులు బాధిత రైతులతో కలిసి నిరసన తెలియజేశారు. గత నెల రోజులుగా శనగపాడు సప్లై ఛానల్ ద్వారా పంటపొలాలకు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
అర్హత కలిగిన కౌలు రైతులకు అందని పెట్టుబడి సాయం...
Farmers Union Leaders Protest In NTR District : ఏడాది రైతులు అప్పులు చేసి ఎకరానికి 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి సాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి చేలు నీళ్లు లేక నెర్రెలు గొట్టి ఎండిపోతున్నాయని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందంటున్నారు. శనగపాడు సప్లై ఛానల్ పరిధిలో ఎగువ నున్న 80 అక్రమ మోటార్ల ద్వారా కొంతమంది నీరు పెట్టుకోవడం వల్ల చివర భూములకు సాగునీరు రావడంలేదని, అధికారులు అక్రమ మోటార్ కనెక్షన్లు తాత్కాలికంగా వారం రోజులు తొలగించి చివర భూముల వరకు సాగునీరు అందేలాగా కృషి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులు రాజకీయాలకు అతీతంగా తమ పంట పొలాలకు సాగునీరు అందేలాగా పోరాడాలని పేర్కొన్నారు.
'మున్నేరు శనగపాడు సప్లై ఛానల్ పరిధిలో సుమారుగా 2000 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండగా.. రైతులు 1200 ఎకరాల్లో ఈ ఏడాది పత్తి, మిర్చి, మాగాణి పంటలు సాగు చేసుకుంటున్నారు. గత నెల రోజుల క్రితం మున్నేరుకు వచ్చిన వరద ఉద్ధృతి వల్ల శనగపాడు సప్లై ఛానల్ కాలువకు పూర్తిగా గండి పడింది. దీంతో నందిగామ అన్నాసాగరం గ్రామాల పరిధిలో సుమారు 600 ఎకరాలకు పైగా చివర భూములకు నీరు అందటం లేదు. అదే విధంగా వత్సవాయి మండలం పోలంపల్లి మున్నేరు డ్యామ్ వరదలకు డ్యామేజ్ కావడంతో కట్టలు తెగి దిగువకు నీరు రావడంలేదు. దీని వల్ల మున్నేరు ఆయకట్టు పరిధిలో 16 వేల ఎకరాలకు సైతం సాగునీరు అందక, పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.' -జిల్లా కౌలు రైతుసంఘం చనుమోలు కృష్ణ