AP Mahila Commission Office: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. బీసీ వర్గాల చావులంటే అంత చిన్నచూపా అంటూ మహిళ కమిషన్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. మంత్రి అంబటి రాంబాబు బాధితులను తక్షణమే ఆదుకోవాలని, లేదంటే.. ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మంత్రిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ నిలదీశారు. బీసీల ద్రోహి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని నేతలు నినాదాలు చేశారు. వైసీపీ పార్టీ నాయకులు రాక్షసుల్ని మించిపోతున్నారని తెలుగుదేశం పార్టీ బీసీ అధ్యక్షులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. నేతల నిరసనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కొల్లు రవీంద్ర, సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అంబటి రాంబాబును బర్తరఫ్ చేయాల్సిందే : కొల్లు రవీంద్ర - Andhra Pradesh State Commission for Women Office
AP Mahila Commission Office: : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. బీసీ వర్గాల చావులంటే అంత చిన్నచూపా అంటూ మహిళ కమిషన్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. మంత్రి అంబటి రాంబాబును బర్తరఫ్ చేయాల్సిందేనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
tdp leaders