TDP-JanSena Discussion on Crop Losses:విజయవాడలో జరిగిన తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశంలో.. ఇరు పార్టీల నేతలు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, రైతులు పడుతున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పలు కీలక తీర్మానాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా.. దేవుడి దయతో అంతా బాగుందని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధమని..టీడీపీ, జనసేన పార్టీల నేతలు ధ్వజమెత్తారు.
TDP-JanSena Resolutions on Drought: రాష్ట్రంలో తాండవ చేస్తున్న కరవు పరిస్థితులపై ఐకాస భేటీలో నిర్ణయించిన తీర్మానాలను టీడీపీ-జనసేన నేతలు వెల్లడించారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..''రాష్ట్ర వ్యాప్తంగా కరవు కళ్ల ముందే కనిపిస్తున్నా అధికార పార్టీ నాయకులు అంతా బాగుందని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఖరీఫ్‌లో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం వాస్తవం కాదా..?. కరవుతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాగునీరు ఇవ్వకే.. పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు దెబ్బతిన్నాయి. సాగునీరు విడుదల, కాల్వల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. కరవు మండలాలను ప్రకటించాల్సిన బాధ్యతను విస్మరించారు. నిబంధనల మేరకు లెక్కిస్తే 449 కరవు మండలాలుగా ప్రకటించాలి. కరవు మండలాలుగా 103 మాత్రమే గుర్తించడం రైతులను మోసగించడమే.'' అని ఇరుపార్టీల నేతలు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహించారు.
ఉమ్మడి మేనిఫెస్టో, 100 రోజుల ప్రణాళిక దిశగా టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం