Tarunchug Fires On TRS: బంగారు తెలంగాణ చేయాలనేది మోదీ కల అని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ప్రజలు కేసీఆర్ నాటకాలను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక ఒక ట్రైలర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి నైతికంగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఉప ఎన్నికల్లో నిమగ్నం చేశారని విమర్శించారు. డబ్బులతో నేతలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
'మునుగోడు ఉపఎన్నిక ట్రైలర్ మాత్రమే.. కేసీఆర్ నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు' - ap political news
Tarunchug Fires On TRS: కట్టుకథలు అల్లుతూ తెరాస చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. తెరాస ఆరోపణలపై బండి సంజయ్ నిన్న యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేశారని.. ఏ తప్పు చేయకపోతే ప్రమాణం చేసేందుకు కేసీఆర్ ఎందుకు రాలేదని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.
భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్
మునుగోడు ప్రజలు వివేకవంతులని.. ఈ విషయం గమనించాలని తరుణ్‌చుగ్ కోరారు. ఎనిమిదేళ్ల తెరాస పాలన గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు, రెండు పడక గదుల ఇళ్లు ఎందరికి వచ్చాయో తెలపాలని నిలదీశారు. తెరాస నేతల నిజరూపం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. యాదాద్రి ఆలయంలో బండి సంజయ్ ప్రమాణం చేశారని.. ఏ తప్పు చేయకపోతే ప్రమాణం చేసేందుకు కేసీఆర్ ఎందుకు రాలేదని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.
ఇవీ చదవండి: