Sajjala Ramakrishna Reddy: రుషికొండ తవ్వకాలు ఏమైనా అంతర్జాతీయ సమస్యా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రుషికొండను టన్నులు, కిలోలు లెక్కగట్టి తవ్వాలా అని ఆయన ప్రశ్నించారు. విశాఖకు రాజధాని రాకుండా చేయాలనే కుట్రతోనే రాజేంద్రసింగ్ లాంటి ఉద్యమకారులతో రుషికొండపై ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని రాజకీయ పార్టీగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని సజ్జల అన్నారు. ఒక వేళ కేసీఆర్ మా మద్దతు కోరితే అందరితో చర్చించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని సజ్జల పునరుద్ఘాటించారు.
రుషికొండ తవ్వకాలేమైనా అంతర్జాతీయ సమస్యా: సజ్జల రామకృష్ణారెడ్డి - Rushikonda Excavations
Sajjala Ramakrishna Reddy: రుషికొండ తవ్వకాల విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రుషికొండ తవ్వకాలు ఏమైనా అంతర్జాతీయ సమస్యనా అని ప్రశ్నించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి
"టన్నులు, కేజీల లెక్కన తూకలు వేసి తవ్వాలా. ప్రభుత్వాన్ని మించిన సంస్థ ఏముంటుంది. రాజ్యంగ వ్యవస్థను మీరు ప్రశ్నిస్తున్నారు. చిన్న గుట్టను పట్టుకుని ప్రపంచం మొత్తం ఏదో అయినట్లు చేస్తున్నారు. అదేమైనా అంతర్జాతీయ సమస్యనా." -సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఇవీ చదవండి: