Reaction Other Party Leaders on Chandrababu Bail: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్ట్) మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌లు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, మరింత ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు.
Pawan Kalyan on Chandrababu Bail:స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. ''చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, మరింత ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలి. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు విడుదల కోట్ల మంది కోరిక'' అని ఆయన అన్నారు.
Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
Daggubati Purandeshwari on Chandrababu Bail:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును తాము మొదటి రోజే తప్పుపట్టామన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణ లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని గతంలోనే బీజేపీ ఖండించిందని ఆమె పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు నాయుడి పేరు లేకుండానే ఆయనను అరెస్టు చేసిన తీరు కూడా సరికాదని వివరించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం మంచి పరిణామం అని పురందేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు.