ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫెర్రీఘాట్​ నిర్వహణను పట్టించుకోని ప్రభుత్వం వెలవెలబోయిన పర్యాటకం - వైసీపీ ఫెర్రీఘాట్​లో పర్యాటకం లోపాలు

Poor Conditions in Ferry Ghat : పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉపయోగపడతాయి. నిర్వాహణ గాలికొదిలేస్తే నిరుపయోగంగా మారిపోతాయి. విజయవాడ శివారుల్లోని కృష్ణా, గోదావరి నదులు కలిసే పవిత్ర సంగమం నిర్వహణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఫెర్రీ ఘాట్‌ కళ తప్పింది. ఫలితంగా పర్యాటకుల సందడి తగ్గిపోయింది. వారాంతరాల్లో పిల్లలతో సేదతీరడానికి వెళ్లే వారికి కూడా నిరాశే మిగులుతోంది. ప్రమాదకరమైన రోడ్లు, కనీస అవసరాలు లేని పరిసరాలతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Visitors Problems at Ferry Ghat
Poor Conditions in Ferry Ghat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 10:46 PM IST

ఫెర్రీఘాట్​ నిర్వహణను పట్టించుకోని ప్రభుత్వం వెలవెలబోయిన పర్యాటకం

Poor Conditions in Ferry Ghat : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగమ ప్రాంతం ఒకప్పుడు ఆహ్లాదాన్ని పంచేది. పవిత్ర సంగమంలో నిర్వహించే నిత్యహారతి కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నిర్వహించిన నక్షత్ర హారతిని వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసేవారు. నగర రణగొణ ధ్వనులతో విసిగిపోయే విజయవాడ నగరవాసులకు ఫెర్రీ ఘాట్.. మంచి ఆహ్లాదాన్ని పంచేది. ఇదంతా గతం... ఇప్పుడేమో పరిస్థితి దయనీయం. వేలాది మంది పర్యాటకులు, భక్తులతో కళకళలాడే ఈ ప్రాంతం నేడు బోసిపోయింది.

రుషికొండ నెత్తిన మరో బండ.. విద్యుత్తు సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు యత్నం

Visitors Problems at Ferry Ghat : తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేక పర్యాటకుల తాకిడి తగ్గింది. పిల్లలేమైనా తిందామన్నా దొరకని పరిస్థితి. నిర్వహణ లోపంలో పెర్రీ ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. మెట్ల కింద చెత్తాచెదారం పేరుకుని పరిసరాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నారని పర్యాటకులు నిట్టూరుస్తున్నారు.

రుషికొండకు కోట్లు.. ఇతర ప్రాజెక్టులకు తూట్లు

'ఒకప్పడు దేవీ నవరాత్రి వేడుకలు, నక్షత్ర హారతితో కలకలలాడేది. ఇప్పుడు సరైన వసతులు లేకపోవడంతో సందర్శకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మంచినీళ్ల కోసం కిలోమీటర్​ కు పైగా వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. పిల్లలు సరదాగా గడిపి,సేదతీరడానికి కూడా ఎటువంటి సౌకర్యం లేదు.ఫెర్రీ ఘాట్ కు వచ్చే రహదారి కూడా దారుణంగా దెబ్బతింది. రోడ్డుపై గుంతలు, నెర్రెలతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు ఇంత అధ్వానంగా మారినా పట్టించుకునే నాథులే కరవయ్యారు'. - పర్యాటకులు.

నాడు కళకళ.. నేడు వెలవెల..! భవానీ ద్వీపం దుస్థితిపై పర్యాటకుల ఆవేదన

YCP Government Neglecting Tourism : కృష్ణా, గోదావరి సంగమ ప్రాంతంగా విజయవాడకు సమీపంలోని పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన ఫెర్రీ ఘాట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. రాష్ట్రంలో పర్యాటకం పరిస్థితి దీనంగా ఉందని అందరికీ తెలిసిన విషయమే.. అభివృద్ధి సంగతి పక్కకుపెడితే ఇది వరకు ఉన్నట్లయినా లేవని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాడు కళకళలాడిన ఘాట్​ నేడు కళావిహీనమై పోయిందని సందర్శకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఫెర్రీఘాట్​ పురోగతికి తగిన చర్యలు చేపడితే బాగుంటుందని వారు అంటున్నారు. నాచుతో పేరుకుపోయిన నీరు, దుర్వాసన వెదజల్లుతున్న పరిసరాలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రపంచం రాష్ట్రంవైపు చూసే పర్యాటకం ఇదేనా..! ఆహా.. ఓహో అంతా ప్రగల్భాలేనా..! కేంద్రం ముందుకొచ్చినా..

ABOUT THE AUTHOR

...view details