GADAPA GADAPA PROGRAM : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నాయకులకు, ఎమ్మెల్యేలకు నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎక్కడికు వెళ్లినా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఎమ్మెల్యే రక్షణ నిధికి చేదు అనుభవం ఎదురైంది. దుందిరపాడులో జరుగుతున్న గడప గడపకు కార్యక్రమంలో ఆయనను ప్రజలు ప్రశ్నించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తమ గ్రామానికి ఏం అభివృద్ధి చేశారో చూపించాలంటూ నిలదీశారు. ఆ క్రమంలో గ్రామస్థులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరగగా పోలీసులు సర్దిచెప్పి కార్యక్రమాన్ని కొనసాగించారు.
"రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. గ్రామానికి ఏం చేశారు" - ఎమ్మెల్యే రక్షణ నిధికి చేదు అనుభవం
PEOPLE FIRES ON MLA RAKSHANA NIDHI : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులకు చేదు అనుభవాలు, నిరసన సెగలు తప్పడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఏం అభివృద్ధి చేశారనే ప్రశ్నే ఎదురవుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఎమ్మెల్యే రక్షణ నిధికి చేదు అనుభవం ఎదురైంది.
PEOPLE FIRES ON MLA RAKSHANA NIDHI
Last Updated : Nov 28, 2022, 3:51 PM IST