Pay and play on the grounds: ఆర్థిక పరిమితుల దృష్ట్యా కొన్ని మైదానాలు, కోర్టులను ప్రైవేటుకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ భైరెడ్డి సిద్దార్ధరెడ్డి తెలిపారు. విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో సంస్థ ఎండీ ప్రభాకరరెడ్డితో కలిసి ఛైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. మైదానాల్లో నగదు చెల్లించి, ఆడుకునే (పే అండ్ ప్లే) విధానం గురించి చర్చించామన్నారు. ఈ పద్దతి కొత్తదేమీ కాదని అన్నారు. 10శాతం పేద క్రీడాకారులను ఉచితంగా సాధన చేసేందుకు తప్పనిసరిగా అనుమతించాలని ఆదేశించామన్నారు. ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వచ్చినట్లైతే.. వాటిపై విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోజు వారీ సాధన చేసే క్రీడాకారులు ఇది వరకు ఉన్న విధానమే బాగుందని భావిస్తే.. ఆ మైదానంలో ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే టెండరును రద్దు చేస్తామన్నారు.
'పే అండ్ ప్లే విధానం.. కొత్తదేమీ కాదు' - శాప్ కార్యాలయం ఎండీ ప్రభాకరరెడ్డి
Pay and play on the grounds: పే అండ్ ప్లే విధానమేమీ కొత్తది కాదని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై విమర్శలు తలెత్తిన నేపథ్యంలో... శాప్ ఎండీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ విధానం సరిగా లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే లీజుకు ఇచ్చిన టెండర్‌ను రద్ద చేయనున్నట్లు తెలిపారు.
భైరెడ్డి సిద్దార్ధరెడ్డి
తమ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించి లీజు పద్ధతిలో మైదానాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చామని.. గతంలోనూ ఈ విధానం కొనసాగిందని తెలిపారు. శాప్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేసిన విమర్శలను ఛైర్మన్ ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలో మైదానాల అభివృద్ధి, క్రీడాకారులకు అందిస్తోన్న ప్రోత్సాహకంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇవీ చదవండి: