Outsourcing Employees State Level Meeting in Vijayawada: అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విజయవాడ జింఖానా మైదానంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ మహాసభను నిర్వహించారు. ఈ సభకు బొప్పరాజుతోపాటు సెక్రటరీ జనరల్ దామోదరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్టు తదితరులు హాజరయ్యారు.
మినిమం టైం స్కేల్ అమలు చేయాలి: రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఓ కాలపరిమితి విధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు. ఆప్కాస్ లో చేరకుండా మిగిలిన లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వం ఆప్కాస్ లో చేర్పించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. స్కిల్, సెమీ స్కిల్ అనే బేధం లేకుండా అందరినీ సమానంగా చూడాలన్నారు. మెప్మా, సెర్ప్ లో పని చేస్తున్న వారికి గతంలో ఇచ్చిన మాదిరిగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మెడికల్ లీవులు ఇవ్వాలని పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబానికి ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును 62 ఏళ్లకు పెంచాలని ఆయన కోరారు.
బీసీ సంక్షేమ శాఖ వద్ద ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన