ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులకు షాక్.. ఏకకాలంలో 55 మందికి మెమోలు - విజయవాడ వార్తలు

Memos to State Commercial Taxes Employees: క్రమశిక్షణ ఉల్లంఘనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని.. సుమారు 55 మంది ఉద్యోగులకు వాణిజ్య పన్నులశాఖ అధికారులు మెమోలు జారీ చేశారు. ఈ మెమోలపై పది రోజుల్లో

memos
మెమోలు

By

Published : Jan 11, 2023, 11:50 AM IST

Memos to State Commercial Taxes Employees: రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖలో సుమారు 55 మంది ఉద్యోగులకు ఏకకాలంలో మెమోలు జారీ చేయడం కలకలం రేపుతోంది. క్రమశిక్షణ ఉల్లంఘనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతనెల 27న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు.. సూర్యనారాయణ నేతృత్వంలో పలువురు ఉద్యోగులు.. ఆఫీసు బేరర్ల బదిలీల విచారణ నివేదికను బయటపెట్టాలంటూ విచారణాధికారి కృష్ణమోహన్‌రెడ్డి ఛాంబరులో 5 గంటలపాటు ధర్నా చేశారు.

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ పరిణామాలపై కృష్ణమోహనరెడ్డి అందించిన నివేదిక ప్రకారం.. వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కార్యాలయం.. ఉద్యోగ సంఘానికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. నిరసనలో పాల్గొన్న నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ కార్యాలయాల ఉద్యోగులకూ ఆయా కార్యాలయాల ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. ఆ రోజున సెలవు పెట్టారో లేదో పది రోజుల్లోగా తెలపాలని ఆదేశించింది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details