Contract faculty Sorting: ఒప్పంద అధ్యాపకుల్ని క్రమబద్ధీకరణ చేస్తామని.. వైసీపీ మేనిఫెస్టోలోనూ పెట్టి ఇప్పుడు మాట తప్పుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల ఒప్పంద అధ్యాపకుల ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10సంవత్సరాల సర్వీస్ ఉన్నవారిని మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 700 మంది మాత్రమే క్రమబద్ధీకరణ అవుతారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేలమంది ఒప్పందం అధ్యాపకులు ఉన్నారని.. మరి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
'ఒప్పంద అధ్యాపకుల్ని క్రమబద్ధీకరించండి.. ఇచ్చిన మాట తప్పకండి'
Contract faculty Sorting: ఒప్పంద అధ్యాపకుల ఫెడరేషన్ సభ్యులు.. తమ పట్ల ప్రభుత్వం చూపుతున్న వైఖరిని నిరసిస్తూ విజయవాడలో సమావేశమయ్యారు. ఒప్పంద అధ్యాపకుల్ని క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ మేనిఫెస్టోలోనూ పెట్టి.. ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలో ఒప్పంద అధ్యాపకుల ఫెడరేషన్ సభ్యుల సమావేశం