Latest Weather Updates in AP : నైరుతి రుతు పవనాలు విస్తరించేందుకు అవసరమైన వాతావరణం బంగాళాఖాతంలో ఉందని గుంటూరు జిల్లా అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంతో పాటు అండమాన్ నికోబార్ దీవులు తదితర ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించింది. దీంతో పాటు మధ్యప్రదేశ్లోని ఆగ్నేయ ప్రాంతం నుంచి తెలంగాణా, కోస్తాంధ్ర , రాయలసీమల మీదుగా కర్ణాటక వరకూ ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది.
2 నుంచి 4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు :దీంతో పాటు ఏపీలోని యానాంలలో నైరుతి గాలులు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం తెలియచేసింది. మరోవైపు రాగల 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అలాగే ప్రస్తుతం నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల్లోనూ ఎలాంటి మార్పులూ ఉండబోవని స్పష్టం చేసింది. చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండటంతో 2 నుంచి 4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈరోజు రాష్ట్రంలో నమోదైన ఉష్టోగ్రతలు :శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పలనాడు జిల్లాలోని మాచర్లలో 44.7 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలో 44.5, పార్వతీపురం మన్యం 44.4, నెల్లూరు వెంకటాచలం 44.4, బాపట్ల 44, నద్యాల 43. తిరుపతి 43.6, కర్నూలు 43.2, ఎన్టీఆర్ 43.2, గుంటూరు 42, తూర్పు గోదావరి 42.7, కడప 42.6, కాకినాడ 42.3, విజయనగరం 42.3, ఏలూరు 41.8, పశ్చిమ గోదావరి 41.9, చిత్తూరు 41.7, కృష్ణా 41.6, అనకాపల్లి 41.4, అన్నమయ్య 41.2, అల్లూరి 40.8, అనంతపురం 40.6, కోనసీమ 40.5, శ్రీ సత్యసాయి 40, విశాఖ 40 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.
జాగ్రత్తలు :ఉష్ణగ్రతల వల్ల అల్లాడిపోతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణగ్రతలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో బయట పనులు చేసుకోవాలని, శరీరానికి వేడి తగలకుండా చూసుకోవాలని వైద్యలు చెబుతున్నారు. ముఖ్యంగా తలకు టోపీ, రుమాలు చుట్టుకోవాలని చెబుతున్నారు. తెలుపు రంగు వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు ధరించడం మేలని అంటున్నారు.
ఇవీ చదవండి