ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ugadi Awards: జయహో భారతీయం.. ఉగాది అవార్డుల ప్రదానం - Ugadi Awards in ap

Jayaho Bharatiyam Ugadi Awards: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలంగాణ ఆసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అధ్వర్యంలో జయహో భారతీయం 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెర్ప్ సీఈవో ఇంతియాజ్, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ విజయ్ బాబు పాల్గొన్నారు. జయహో భారతీయం సంస్థ ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు.

Ugadi Awards
ఉగాది అవార్డుల ప్రదానం

By

Published : Apr 17, 2023, 10:06 PM IST

Tummalapalli Kalakshetram: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జయహో భారతీయం 6వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన కళాకారులతో పాటుగా వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెర్ప్ సీఈవో ఇంతియాజ్, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ విజయ్ బాబు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఒక వేదిక పైకి తీసుకువచ్చి సత్కరించడం ప్రశంసనీయమని సెర్ప్ సీఈవో ఇంతియాజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ విజయ్ బాబు తెలిపారు. తెలంగాణ ఆసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు వారు జరుపుకునే పండుగ ఉగాది పండుగని వారు పేర్కొన్నారు.

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలంగాణ ఆసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అధ్వర్యంలో జయహో భారతీయం 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది అవార్డులను నిర్వహకులు ప్రధానం చేశారు. దాదాపు 46 విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులను అవార్డులకు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి విశిష్ట సేవారత్న, తెలుగురత్న,యువరత్న పేరుతో పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెర్ప్ సీఈవో ఇంతియాజ్, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ విజయ్ బాబు పాల్గొని అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించి అవార్డులను అందించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా విజయ్ బాబు, ఇంతియాజ్ మాట్లాడుతూ తెలుగు పంప్రదాయాలను కొనసాగించేలా జయహో బారతీయం నిర్వాహకులు ఉగాది వేడుకులు నిర్వహించి అవార్డులు ప్రదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇంతమందిని ఒకే వేదికపైకి తీసుకు రావడం అంత సులభం కాదన్నారు. నేడు అవార్డులు అందుకున్న వారు కూడా వారి వారి రంగాల్లో విశేష సేవలు అందించిన వారేనని తెలిపారు.

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జయహో భారతీయం వేడుకలు

జయహో భారతీయం పేరుతో అవార్డులను ఇస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన కళాకారులను, వ్యక్తులను గుర్తించి అవార్డులతో సత్కరిస్తున్నారు. ప్రతిభావంతులైన వారిని గుర్తించి వారికి అవాకాశాలు కల్పించడం సంతోషంగా ఉంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఈ అవార్డు ఇవ్వడం వల్ల వారికి మరింత గుర్తింపు వస్తోంది. జయహో భారతీయం సంస్థ ఆయా రంగాల్లో సేవలు చేసే వారిని ప్రోత్సహిస్తున్న విధానం చాలా నచ్చింది. -విజయ్ బాబు, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details