ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆదాయం 16.71 కోట్లు - ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం వల్ల కాస్త తగ్గిందన్న ఈవో - AP Latest News

Indrakeeladri Income for Dussehra Festival : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి 16 కోట్ల 71 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు పాలకమండలి అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఆదాయం కొంత తగ్గినా.. సుమారు 15 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. ఈనెల 14 నుంచి కార్తిక మాసం ప్రారంభం కానుందని.. విశేషమైన పూజలు, బిల్వార్చనలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Income_From_Ticket_Sales_in_Indrakeeladri
Indrakeeladri_Income_for_Dussehra_Festival

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 7:58 PM IST

Indrakeeladri Income for Dussehra Festival :విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత మూడు రోజులపాటు భవానీల తాకిడి దృష్ట్యా ఈ ఏడాది దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి 16 కోట్ల 71 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కే.ఎస్ రామారావు తెలిపారు.

ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆదాయం 16.71 కోట్లు - ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం వల్ల కాస్త తగ్గిందన్న ఈవో

FAKE CERTIFICATES: ఇంద్రకీలాద్రిలో ఆగని 'నకిలీ'లలు.. ఉద్యోగుల సస్పెన్షన్​

Income From Sale of Laddu in Indrakeeladr : ఉత్సవ ఏర్పాట్ల కోసం సుమారు ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే కొంతవరకు ఆదాయం తగ్గినా... సుమారు 15 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. గతనెల 15 నుంచి 26వ తేదీ వరకు 25 లక్షల 15 వేల లడ్డూలను విక్రయించామని తెలిపారు.

Income From Ticket Sales in Indrakeeladri :78 వేల మంది భక్తులు ఐదు వందలు, మూడు వందలు, వంద రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసి దర్శనాలు చేసుకున్నారని.. ఇతరులకు ఉచితంగా అమ్మవారి దర్శనం కలిపించినట్లుఅమ్మవారి దేవస్థానంలో వైదిక కమిటీ సభ్యులు, అధికారులు, పాలకమండలి సభ్యులు కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. అదేవిధంగా లక్షా 46 వేల మంది కేశఖండన చేయించుకున్నారని తెలిపారు.

ఇంద్రకీలాద్రి అభివృద్ధి అబద్ధమేనా.. హామీలను గాలికొదిలేసిన సర్కారు

Number of Devotees Visiting Indrakeeladri: దసరా ఉత్సవాల ప్రారంభం రోజు, మూల నక్షత్రం రోజుతోపాటు విజయదశమి తర్వాత మూడు రోజులు దాదాపుగా లక్షన్నర మంది వరకు భక్తులుఅమ్మవారి దర్శనం చేసుకున్నారని చెప్పారు. ఈనెల 14 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుందని.. ఈ నెల రోజులు విశేషమైన పూజలు, బిల్వార్చనలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

జీర్ణోద్దరణ అనంతరం మల్లేశ్వరస్వామి ఆలయాన్ని 19వ తేదీన ప్రారంభించేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అదే రోజు అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు ఖరారు అయిన వాటికి ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయిస్తామన్నారు. కార్తికమాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈనెల 15వ తేదీన ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవాన్ని ఏర్పాటు చేశామన్నారు. 16వ తేదీన సరస్వతీ యాగం నిర్వహిస్తామన్నారు.

ఇంద్రకీలాద్రి అమ్మవారికి.. ఆ సరుకులతో నైవేద్యం : జనసేన

Indrakeeladri Income During Dussehra :కార్తికమాసంలో ప్రతి సోమవారంతోపాటు విశేషమైన రోజుల్లో బిల్వార్చన జరుగుతుందని చెప్పారు. ఈనెల 16న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం జరుపుతామని.. 27వ తేదీ కార్తిక పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఉంటుందన్నారు. ఈనెల 23 నుంచి 27 వరకు భవానీ మండల దీక్ష మాలధారణలు, డిసెంబరు 13 నుంచి 17 వరకు భవానీ అర్ధమండల దీక్ష మాలధారణలు జరుగుతాయన్నారు.

జనవరి మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు భవానీదీక్షల విరమణ, శతచండీయాగానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. డిసెంబరు 26న కలశజ్యోతి మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details