ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో హిట్-2 చిత్ర బృందం సందడి - హిట్2 మూవీ తాజా సమాచారం

HIT 2 MOVIE : ప్రేమ, కామెడీ, యాక్షన్ అన్ని కలిసి ఒకే సినిమాలో ఉంటే ప్రతి ప్రేక్షకుడికి పండగే. అలాంటి సినిమానే హిట్-2. ఈ సినిమా హిట్ అవ్వడంతో హీరో, హీరోయిన్ విజయవాడలో సందడి చేశారు.

Hit 2 movie success meet
విజయవాడలో సందడి చేసిన హిట్ మూవీ బృందం

By

Published : Dec 10, 2022, 6:40 PM IST

హిట్2 సినిమా

HIT 2 MOVIE : అడవి శేష్​ నటించిన హిట్ 2 సినిమా బృదం విజయవాడలో సందడి చేసింది. మంచి హిట్​ని తమకు అందించిన ఆడియన్స్​కి చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం హిట్ సినిమాకి కొనసాగింపుగా వచ్చిందని హీరో అడవి శేష్​ తెలిపారు. ఈ సినిమా యువతని ఎక్కువగా ఆకర్శించిందన్నారు. ఈ చిత్రం ఆడియన్స్ కి చక్కటి వినోదాన్ని అందించిందన్నారు. విజయవాడతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా శేష్​ గుర్తు చేసుకున్నారు. ప్రేమ, కామెడీ, యాక్షన్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఈ చిత్రం ఎంతో వినోదం అందించిందన్నారు. హిట్3 లో హీరోగా నటించేది నాని అని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details