ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుణదలలో మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం.. లక్షల్లో తరలిరానున్న భక్తులు - andhra pradesh news

Gunadala Mary Mata Festival: గుణదల మేరీ మాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 99వ సంవత్సరం జరగుతున్న.. విజయవాడలోని గుణదల మేరీ ఉత్సవాలకు లక్షల్లో భక్తులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని మత పెద్దలు తెలిపారు.

Gunadala Mary Mata Festival
గుణదల మేరీ మాత ఉత్సవాలు

By

Published : Feb 9, 2023, 4:49 PM IST

Gunadala Mary Mata Festival: విజయవాడలోని గుణదల మేరీ మాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రారంభమైన ఉత్సవాలు రేపు, ఎల్లుండి కూడా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. 99వ సంవత్సరం జరుగుతున్న ఈ గుణదల మేరీ మాత ఉత్సవాలు.. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా ఆగిపోయాయని.. ఈ ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని మత పెద్దలు తెలిపారు.

ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సుమారు 900 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకమైన గుణదల మేరిమాత ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.

విజయవాడలోని గుణదల మేరీ మాత ఉత్సవాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details