ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరంపై ముఖ్యమంత్రిని నిలదీద్దాం: వైఎస్ సన్నిహితుడు కేవీపీ - ap news

KVP Comments on Polavaram: పోలవరంపై ముఖ్యమంత్రిని నిలదీద్దామని మాజీ ఎంపీ, కాంగ్రెస్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాలుగు లక్షల మంది నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

kvp
కేవీపీ

By

Published : Jan 5, 2023, 2:48 PM IST

KVP Comments on Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని నిలదీద్దామని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2013 పునరావాస చట్టం ప్రకారం నాలుగు లక్షల మంది నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయవాడలోని ఆంధ్ర రత్నభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ, భాజపా ఒక మాట మీద నిలబడలేదని విమర్శించారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి మార్పు సమాచారం తెలిశాక సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ పీసీసీ అధ్యక్షుడు అవుతారని అనుకున్నానని.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి చింతా మోహన్‌ సేవలు అవసరమని పార్టీ భావించినట్లు ఉందన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేవీపీ రామచంద్రరావు

"పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడిగా గుర్తించి.. ఈ ప్రాజెక్టు వలన కొన్ని కోట్ల మందికి నేరుగా ప్రయోజనం ఉంటుంది. గోదావరి మిగులు జలాలను కృష్ణాలో కలపడం వలన.. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయడం వీలవుతుంది. 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. నాలుగు లక్షల నిర్వాసితుల కోసం పోరాడదాం.. వాళ్లకి న్యాయం జరిగేలా చూద్దాం. 2013 పునరావాస చట్టం ప్రకారం వాళ్లకి పూర్తి న్యాయం జరిగేలా చూద్దాం. జగన్​ని నిలదీసి అడుగుదాం.. పోరాడదాం". - కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details