Tenders for smart meters: ఇంధన శాఖ ఆమోదం, అంగీకారంతోనే స్మార్ట్ మీటర్ల టెండర్లను విద్యుత్ పంపిణీ సంస్థలు పిలుస్తున్నాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ స్పష్టం చేసారు. స్మార్ట్ మీటర్లకు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయన్న అయన ఏపీ 16వ రాష్ట్రమని పేర్కొన్నారు. దశల వారీగా 2025 నాటికి దేశ వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం యోచిస్తోందని వెల్లడించారు. ఏపిలో 2023 డిసెంబర్ నాటికి మొదటి దశ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
2023 చివరికల్లా మొదటి దశ స్మార్ట్ మీటర్ల బిగింపు: విజయానంద్ - AP main news
Tenders for smart meters: ఇంధన శాఖ ఆమోదం, అంగీకారంతోనే స్మార్ట్ మీటర్ల టెండర్లను విద్యుత్ పంపిణీ సంస్థలు పిలుస్తున్నాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ స్పష్టం చేసారు. తొలిదశలో 27లక్షల స్మార్ట్ మీటర్లు మాత్రమే బిగించాలని నిర్ణయించామన్నారు. అందులో 4.72లక్షల మీటర్లు మాత్రమే గృహాలకు ఏర్పాటు చేస్తామాని తెలిపారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అర్ఈసి నిర్దేశించిన టెండర్ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించడం లేదని తెలిపారు.
మొదటి దశలో విద్యుత్ నష్టాల తగ్గింపు, స్మార్ట్ మీటర్ల కోసం 13,252 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. విద్యుత్ నష్టాల తగ్గింపులో భాగంగా కొత్త ఫీడర్ల ఏర్పాటు కోసం కేంద్రం రూ.5,484 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇస్తుందన్నారు. తొలిదశలో 27లక్షల స్మార్ట్ మీటర్లు మాత్రమే బిగించాలని నిర్ణయించామన్నారు. అందులో 4.72లక్షల మీటర్లు మాత్రమే గృహాలకు ఏర్పాటు చేస్తామన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి నిర్దేశించిన టెండర్ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించడం లేదని తెలిపారు.
ఇవీ చదవండి: