Farmers Want to Government Help in Rabi Season:ఖరీఫ్ సీజన్‌లో పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీ సీజన్ వచ్చినప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో.. ఎలాంటి పంటలు వేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై రైతులను అప్రమత్తం చేసేవారే కరవయ్యారు. రబీ కార్యాచరణ ప్రణాళికలు కనీసం కాగితాలను దాటడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది వర్షాభావానికి తోడు జలాశయాల నుంచి పంటలకు సాగునీరందకపోవటంతో ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 85 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను.. ఏకంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పంటలు వేయడానికే అవకాశం లేకుండా పోయింది.
ఉమ్మడి కర్నూలును అల్లాడిస్తున్న కరవు - తాగునీటికి ప్రజలు మూగజీవుల అవస్థలు
రాజ్యమేలుతున్న కరవు: కరవు మండలాలుగా ప్రకటించటంలో ప్రభుత్వం చెబుతున్న సాంకేతిక కారణాలను పక్కనపెడితే వాస్తవంగా 350 నుంచి 400 మండలాల్లో కరవు రాజ్యమేలుతోంది. 50, 60 మండలాల్లో తాగేందుకు సైతం నీరులేని విధంగా దుర్భిక్ష పరిస్థితులున్నాయి. 428 మండలాల్లో 28 శాతం మేర వర్షపాతం లోటుంది. నీరందక వరి, మిర్చి, పత్తి వంటి పంటలు ఎండిపోయాయి. ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపి కొన్నింటినే కరవు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
"పైర్లు బాగా దెబ్బతిని రైతులు ఆగమైపోయారు. నాగార్జుసాగర్ కాలువ రాకపోవడం.. వర్షాలు లేక పంటలు సక్రమంగా రాలేదు. దీనివల్ల రైతులు పంటలు నష్టపోయారు. ప్రభుత్వం కరవు మండలాలు ప్రకటించి ఏదోవిధంగా రైతుకు సహాయం చేయాలి." -వెంకటేశ్వరరావు, రైతు
'అనంత' కరవు కష్టం! ఎండిన చెరువులు, అడుగంటిన బోర్లు - రైతుల కన్నీళ్లు పట్టని వైసీపీ పాలకులు