Achanta Sunitha: డ్వాక్రాకు జగన్ రెడ్డి మూడున్నరెళ్ళ పాలనలో ఒరిగింది శూన్యమని టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ధ్వజమెత్తారు. జగన్ సభలకు జనాన్ని తరలించే వ్యవస్థగా డ్వాక్రా ని మార్చారని దుయ్యబట్టారు. డ్వాక్రా వ్యవస్థను నాశనం చేస్తూనే.. సొంత పత్రికలో పచ్చి అబద్దాలు రాస్తున్నారని సునీత ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న రుణాలు 13వేల 500 కోట్లు మాత్రమేనని, చంద్రబాబు రెండు విడతల్లో 18వేల 500 కోట్లు రుణమాఫీగా ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. సొంత పత్రిక పత్రిక పెట్టుకుని తప్పుడు రాతలు రాయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. జగన్ దిగజారిన రాజకీయానికి డ్వాక్రాపై సొంత పత్రికలో రాస్తున్న తప్పుడు రాతలు నిదర్శనమని ఆక్షేపించారు. జగన్ అధికారాన్ని అహంకారాన్ని కూకటి వేళ్ళతో పెకిలించడానికి డ్వాక్రా మహిళలు సిద్దం ఉన్నారని ఆచంట పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు ఒరిగిందేమి లేదు : ఆచంట సునీత - విజయవాడ రాజకీయ వార్తలు
Achanta Sunitha:డ్వాక్రాకు జగన్ రెడ్డి మూడున్నరెళ్ళ పాలనలో ఒరిగింది శూన్యమని టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ధ్వజమెత్తారు. జగన్ తన సొంత పత్రికలో తప్పుడు రాతలు రాసున్నారని, డ్వాక్రా మహిళలకు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే న్యాయం జరిగిందని, గణాంకాలతో సహా తెలియజేశారు.
Etv Bharat