ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"దీపావళి డాడీ" ఇంట్లో చిన్నారుల సంబరం - Diwali Dad in Andhra pradesh

Diwali Dad in Andhra Pradesh: పండుగ అంటే కుటుంబమంతా సంతోషంగా కలిసి చేసుకుంటారు. కానీ ఎవరూ లేని అనాథలను ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులుగా భావించి వారితో తన ఇంట్లోనే పండుగను చేసుకుంటున్నారు. దాదాపు 11 సంవత్సరాల నుంచి చిన్నారులతో కలిసి పండుగ చేసుకుని.. వారికి దీపావళి డాడీగా మారారు కార్పొరేటర్​ ఉమ్మడి వెంకటేశ్వరరావు. చిన్నారులకు తల్లిదండ్రులు లేని లోటు తెలీకుండా వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు.

Diwali dadi
దీపావళి డాడీ

By

Published : Oct 25, 2022, 5:01 PM IST

అనాథలకు ఆయన "దీపావళి డాడీ"

Diwali Dad in Vijayawada: పండుగ వచ్చిందంటే చిన్నారుల్లో ఉండే ఆనందమే వేరు. అదే దీపావళి అయితే, ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. రకరకాల టపాసులు కొనమని తల్లిదండ్రుల్ని అడుగుతూ ఉంటారు. మరి ఎవరూ లేని అనాథల పరిస్థితి ఏంటి..?. శుభకార్యాలప్పుడు వారికి భోజనాన్ని అందించే వారు ఉంటారు గానీ,.. ఇంటికి పిలిచి యోగక్షేమాలు అడిగే వారు ఎవరూ ఉండరు. తల్లిదండ్రులు లేని వారికి టపాసులు ఎవరు కొనిపెడతారు. వారి సంతోషాల్నితీర్చేదెవరు.? ఇదే ఆలోచనతో, పన్నెండేళ్లుగా అనాథలతో పండుగ జరుపుకుంటూ.. దీపావళి డాడీగా మారిపోయారు ఓ వ్యక్తి.

తెదేపా కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు: కృష్ణా జిల్లా గన్నవరంలోని కేర్ అండ్ షేర్ సంస్థ అనాథలను, హెచ్‌ఐవీ సోకిన పిల్లల్ని అక్కున చేర్చుకుని.. వారి ఆలనా పాలన చూస్తోంది. వారికి అన్నిరకాల వసతుల కల్పనతో పాటు విద్య అందిస్తున్నారు. కానీ వీరికి తల్లిదండ్రులు లేని లోటు తెలియనీయకుండా, విజయవాడ మల్లిఖార్జున పేటకు చెందిన తెదేపా కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు ఓ మంచి నాన్నలా అండగా నిలుస్తున్నారు. పన్నెండేళ్లగా ప్రతి దీపావళికి గన్నవరం నుంచి పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లి.. ఘనంగా వారితో పండుగ జరుపుకుంటున్నారు. ఈ ఏడాదీ పిల్లలను ఇంటికి తీసుకెళ్లి వారు కోరినట్లు భోజనాలు ఏర్పాటు చేశారు. టపాసులు పేల్చుతూ, ఆటపాటలతో చిన్నారులు సంతోషంగా పండుగ జరుపుకున్నారు.

దీపావళి డాడీ:మిత్రబృందంతో కలిసి 2011 నుంచి చిన్నారులకు వెంకటేశ్వరరావు ఆపన్నహస్తం అందిస్తున్నారు. పండుగ రోజుల్లో ఆయన గన్నవరం కేర్ అండ్ షేర్ సంస్థకు వెళతారు. సంక్రాంతి సమయంలో పిల్లల కోసం అన్ని రకాల పిండి వంటలు తయారు చేయించి పంపిణీ చేస్తారు. ఇలా అనాథ చిన్నారుల బాగోగులు చూస్తుండటంతో వెంకటేశ్వరరావును పిల్లలు "దీపావళి డాడీ" అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఏటా దీపావళి పండుగను డాడీతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు.

మదర్ థెరిస్సా చూపిన మార్గమే తనకు అనుసరణీయమని ఉమ్మడి వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఎవరూ లేరని చిన్నారులు బాధపడకుండా ఆనందంగా ఉండాలనేదే తన అభిమతం అంటున్నారు. చంటి లాంటి దాతలు మరింత మంది ముందుకు వచ్చి సహకారం అందించాలని కేర్ అండ్ షేర్ సంస్థ.. నిర్వాహకులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details