Devineni Uma Serious Allegations: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసనగా... ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఉమా మహేశ్వర్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల వినియోగంపై పున సమీక్ష చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణమని దేవినేని ఉమా ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగంపై ఎపెక్స్ కౌన్సిల్లో సరైన వాదాలను వినిపించకపోవడం వల్లనే ఈరోజు ఏపీకి తీవ్ర అన్యాయం జరగబోతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో తెలంగాణ నాయకుల నుంచి 1200 కోట్ల రూపాయలు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు చేశారని ఉమా ఆరోపించారు. దీనికిగాను ప్రతిఫలంగా రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్లో సరైన వాధనలు వినిపించకపోవడం వలన నేడు కృష్ణా జలాలో ఏపీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ సుప్రీంకోర్టులో రద్దు కాకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి 52 నెలలుగా ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి ని కాపాడేందుకు కేంద్రానికి దాసోహం అయ్యారని తెలిపారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయితే తాడేపల్లి కొంపలో ఇద్దరు పేర్లు బయటికి వస్తాయని సీఎం భయపడుతున్నారు అన్నారు. తెలంగాణతో పాటు ఏపీ కూడా ఎన్నికలకు జరిపించాలని కోరుతూ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలవడానికి వెళ్లారన్నారు. తెలంగాణతో పాటు ఏపీ కూడా ఎన్నికలు కు వెళ్లాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబును బయటికి రాకుండా చేసేందుకు పీటి వారెంట్లోపై మళ్లీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు.
CM Jagan Delhi Tour ఒక్కొక్కరుగా హస్తినకు.. సీఎం దిల్లీ పర్యటనలో ఏం జరిగేనో..!