Daughter performed last rites: కాసులిస్తేనే తలకొరివి పెడతానన్న కుమారుని కాదని, కన్న కుమార్తె తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండటం గుమ్మడిదుర్రులో చోటుచేసుకుంది. గతంలో కోటయ్యకు ఉన్న భూమిని విక్రయించగా కోటి రూపాయలు వచ్చాయి. అందులో 30 లక్షల తన వద్ద ఉంచుకొని మిగిలిన సొమ్మును కొడుక్కి ఇచ్చాడు. ఆ సొమ్మును కూడా ఇవ్వాలని కొడుకు గత కొంతకాలంగా తండ్రితో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కోటయ్య, అతని భార్య ఇద్దరు గత కొంతకాలంగా కుమార్తె వద్ద ఉంటున్నారు. వారి బాగోగులను కుమార్తె చూస్తు వస్తోంది. అయితే, ఇటీవల అనారోగ్య సమస్యలతో కోటయ్య నిన్న మృతి చెందాడు. ఈ సమాచారాన్ని కుమారుడికి చేరవేయగా.. తండ్రి వద్ద ఉన్న రూ.30 లక్షలు ఇస్తేనే కొరివి పెడతానని షరతు పెట్టాడు. దీంతో కన్న కూతురు విజయలక్ష్మే కొడుకు బాధ్యతను భుజాన వేసుకుంది. అన్ని తానై అంత్యక్రియలు నిర్వహించింది.
కాసులిస్తేనే తలకొరివి పెడతానన్న కుమారుడు.. తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తె - NTR District
Daughter performed last rites: కాసులు చెల్లిస్తే తండ్రికి ఖర్మ చేస్తానంటూ ఓ కుమారుడు భీష్మించటంతో.. కుమార్తె, తండ్రికి అంత్యక్రియలు జరిపిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. అనిగండ్లపాడుకు చెందిన కోటయ్య.. గతంలో తన ఆస్తిని అమ్మి 70 లక్షలు కుమారుడికి ఇచ్చాడు. మిగిలిన రూ.30 లక్షలతో కుమార్తె వద్ద ఉంటున్నాడు. అకస్మాత్తుగా అనారోగ్యంతో కోటయ్య మృతి చెందారు. తండ్రి మరణ వార్తను కుమారుడికి చెప్పగా.. అంత్యక్రియలు చేయాడానికి నిరాకరించాడు.. రూ.30 లక్షలు ఇస్తేనే తలకొరివి పెడతానని చెప్పాడు. దీంతో కుమార్తె అంత్యక్రియలు నిర్వహించింది.
Daughter performed last rites
Last Updated : Feb 4, 2023, 2:07 PM IST