Solar Eclipse Temples closed: తెలంగాణలో ఈరోజు సాయంత్రం నుంచి సూర్యగ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలను మూసివేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు అన్ని ఆలయాలను మూసివేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఉదయం 8గంటల 50 నిమిషాల నుంచి రేపు ఉదయం 8గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయంలో ఆరాధనలు, నివేదనలు, నిత్యకల్యాణం వంటి కార్యక్రమాలు నిర్వహించబోమని వెల్లడించారు. 26వ తేదీన ఆలయాన్ని శుద్ధి చేసి రేపు ఉదయం పదిన్నర నుంచి భక్తులను అనుమతిస్తారు.
సూర్యగ్రహణం ప్రభావం.. తెలంగాణలోని ఆలయాలు మూసివేత - ap latest news
Solar Eclipse Temples closed: తెలంగాణలో సూర్యగ్రహణం కారణంగా అన్ని ఆలయాలను మూసివేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.
సూర్యగ్రహణం
భద్రాద్రిలోని ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధానపూజారి తెలిపారు. అటు ధర్మపురి, కాళేశ్వరం, బాసర, వేములవాడ, జోగులాంబ ఆలయాలను కూడా ఉదయం తొమ్మిది గంటలలోపే మూసివేశారు. రాత్రి 8 తరువాత సంప్రోక్షణ నిర్వహించి.. రేపటి నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు.
ఇవీ చదవండి: