ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'‘మోదీ ఎట్‌ద రేట్‌ ఆఫ్‌ 20 ఏళ్లు. స్వప్నించాడు-సాధించాడు’' పుస్తకం ఆవిష్కరణ - Andhra Pradesh important news

విజయవాడలో జరుగుతున్న 33వ పుస్తక ప్రదర్శనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌లు హాజరయ్యారు. అనంతరం గొల్లపూడి మారుతీరావు సాంస్కృతిక వేదికపై ఎమెస్కో విజయ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో పాల్గొని..'‘మోదీ ఎట్‌ద రేట్‌ ఆఫ్‌ 20 ఏళ్లు. స్వప్నించాడు-సాధించాడు’' అనే తెలుగు వెర్షన్‌ను పుస్తకాన్ని ఆవిష్కరించారు.

new book
new book

By

Published : Feb 15, 2023, 10:40 AM IST

''ప్రజలకు ఖచ్చితంగా కొన్ని పథకాలను ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అదొక్కటే అజెండా కాకూడదు. ఈరోజు పరిపాలన అంటే కొన్నిచోట్ల ఉచితాలు పంపిణీ ఒక్కటే అన్నట్లుగా ఉంటోంది. అదొక్కటే ప్రభుత్వ పనితీరు అనిపించుకోదు. అది నేతల ప్రతిభా కాదు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న మొత్తాలను పంచడం గొప్పతనం ఎలా అవుతుంది.?. ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపించాలని.. మౌలిక వసతులు కల్పించాలని.. ప్రజల్లోని పేదరికాన్ని నిర్మూలించాలని.. ఆ దిశగా ప్రధాని నరేంద్రమోదీ పాలన సాగుతోంది'' అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

విజయవాడలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన 'పుస్తక మహోత్సవం'లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. '‘మోదీ ఎట్‌ద రేట్‌ ఆఫ్‌ 20 ఏళ్లు. స్వప్నించాడు-సాధించాడు’' అనే తెలుగు అనువాద పుస్తకాన్ని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, ఇతరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధంగా నడిపించారన్నారు. మోదీ జీవితంలో సాధించిన ఘనతలను, విశేషాలను 21 మంది రచయితలు కూలంకుషంగా పరిశీలించి, పరిశోధించి ఈ పుస్తకానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలనేది మోదీ ఆలోచన అని.. ప్రధాన మంత్రి పుస్తక ప్రేమికులని కిషన్ రెడ్డి తెలిపారు.

అనంతరం కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మాట్లాడుతూ.. తాను పతకాలు సాధించడానికి ప్రధాని మోదీ అందించిన ప్రోత్సాహమే కారణమని పీ.వీ. సింధు తన పుస్తకంలో రాశారని ఆయన తెలిపారు. "మోదీ ఎట్‌ద రేట్‌ ఆఫ్‌ 20 ఏళ్లు. స్వప్నించాడు-సాధించాడు'' అనే పుస్తకం చాలా ప్రజాదరణ పొందుతోందని పేర్కొన్నారు. ఎందుకంటే.. మోదీ గొత్పతనాన్ని ప్రజలు చదవాలనుకుంటున్నారని.. ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త తప్పకుండా పుస్తకాలు చదవాలను చదివి నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలని ఆయన సూచించారు.

రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో మోడల్‌ ఆఫీసులు కడుతున్నామన్నారు. ప్రతి ఒక్క పార్టీ కార్యాలయంలో గ్రంథాలయం ఉంటుందని, పుస్తకాలతో పాటు డిజిటల్‌ లైబ్రరీ అందుబాటులో ఉంటాయన్నారు. మోదీ అనుకున్న దాని ప్రకారం అదొక స్టడీ సర్కిల్‌ అని తెలిపారు. యోగాను మోదీ ప్రపంచానికి పరిచయం చేయగా.. అది ఈరోజు 190 దేశాలు ఆచరిస్తున్నాయని, భారతదేశం సామర్థ్యాన్ని మోదీ విశ్వసించారని వివరించారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ సిద్దాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను ప్రధాని నరేంద్ర మోదీ మనసా వాచా కర్మణా అనుసరిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. మానవీయ కోణంలో అభివృద్ధి ఉండాలని అభిలషిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. మోదీ ప్రస్థానం దేశ చరిత్రలో సింగపూర్‌ మాజీ ప్రధాని లీ క్వాన్‌‌యూతో సమానంగా ఉంటుందని ఆయన ప్రశంసించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details