CPI State Secretary Ramakrishna comments: చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ భేటీ కావడాన్ని అధికార వైసీపీ తప్పా వివిధ పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఆయా సందర్బాల్లో ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వ చర్యలకు సంఘీభావం తెలపడాన్ని సైతం రాజకీయ కొణంలో చూస్తున్న సమయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు.
త్వరలోనే మేమూ చంద్రబాబును కలుస్తాం: సీపీఐ నేత రామకృష్ణ - ఏపీ తాజా సమాచారం
CPI leader Ramakrishna comments: వైసీపీ అవలంబిస్తున్న విధానాలపై ప్రతిపక్షాలు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు పవన్ కల్యాణ్ చంద్రబాబును కలవడం శుభపరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. త్వరలోనే తాము సైతం చంద్రబాబును కలుస్తామని ఆయన వెల్లడించారు.
సీపీఐ నేత రామకృష్ణ
ప్రతిపక్ష నాయకుల భేటీ మంచి అంశంగా రామకృష్ణ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తెదేపా అధినేత నారా చంద్రబాబును కలవటం మంచి పరిణామం అన్నారు. తాము సైతం మొదటి నుంచే ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడాలని కోరుతున్నామని తెలిపారు. అన్నీ పక్షాలు కలిసి పోరాడకపోతే ప్రజాస్వామ్యం కానరాదన్నారు. మేమూ త్వరలోనే చంద్రబాబును కలుస్తామని రామకృష్ణ వెల్లడించారు.
ఇవీ చదవండి: