CPI and CPM on Hike Charges: కమిషన్లకు కక్కుర్తిపడి ఆదానీకి లొంగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలపై భారాలు మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నా.. రాజస్థాన్ నుంచి కొనుగోలు చేస్తున్నారని.. తద్వారా ప్రజలపై రూ. 25 వేల కోట్ల భారం పడుతోందని ఆయన ఆరోపించారు. వామపక్షాల అధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను సీపీఐ, సీపీఎం(వామపక్షాలు) రాష్ట్ర కార్యదర్శులు ఎండగట్టారు. 'చెత్తపైన పన్ను వేసిన ఈ ప్రభుత్వం.. చెత్త ప్రభుత్వమే' అని రామకృష్ణ ధ్వజమెత్తారు. డీజిల్ ధర పెరిగిందని సెస్ పేరుతో రూ. 720 కోట్లు, విద్యుత్ ఛార్జీల పేరుతో రూ. 25 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. దీనిపై అన్ని పార్టీలు కలిపి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
'కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజలపై భారాలు మోపుతోంది' - cpm srinivasa rao protest against charges hike
Left Parties on YSRCP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాలను వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులు ఎండగట్టారు. వైకాపా సర్కార్.. కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజలపై భారాలు మోపుతోందని మండిపడ్డారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో వామపక్షాల అధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
left parties fires on cm jagan
పోరాటం మానేసి ఛార్జీలు పెంచడం ఏంటి?:ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈనెల 25న సచివాలయ వద్ద ధర్నా చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇంధన ధరలు పెంచడంపై కేంద్రంతో పోరాటం చేయకుండా.. డీజిల్ ధరలు పెరిగిందని బస్ ఛార్జీలు పెంచటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ధరల పెంపును నిరసిస్తూ.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి:అల్లూరి ఉద్యమ స్ఫూర్తితో సమాజ శ్రేయస్సుకు యువత తోడ్పడాలి: ఉపరాష్ట్రపతి