CM Jagan Speech in APNGOs Meeting in Vijayawada: విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం, ముఖ్యమంత్రి అయినా వాటిని అమలు చేసేది ఉద్యోగులే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవోల 21వ రాష్ట్ర మహా సభలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఉద్యోగుల బాగోగులపై ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించగలిగామన్నారు. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేలా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
CM Jagan Comments on CPS in APNGO Meeting: "సీపీఎస్ రద్దుపై మాట తప్పే ఉద్దేశం ఉంటే.. జీపీఎస్ తెచ్చేవాళ్లం కాదు"
CM Jagan Comments on CPS: సీపీఎస్ రద్దు అసాధ్యమని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. సుదీర్ఘ అధ్యయనం తర్వాత O.P.Sకు బదులు G.P.S తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. G.P.Sతో ఉద్యోగులకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. సీపీఎస్ రద్దుపై మాట తప్పే ఉద్దేశం ఉంటే జీపీఎస్ కూడా తెచ్చేవాళ్లం కాదన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఏపీఎన్జీవోల రాష్ట్రస్థాయి సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
YSRCP 2024 MLA Candidates First List వైసీపీ ఎమ్మెల్యేల ఫస్ట్ లిస్ట్‌కు ముహుర్తం ఫిక్స్..! వారికి ఝలక్ ఇవ్వనున్న సీఎం జగన్..!
CM Jagan Comments on RTC: యువతకు 1లక్షా 35వేల శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు. విలీనం ప్రక్రియలో ఎక్కడా తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు. గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు జీతాలు పెంచారని.. అధికారంలోకి వచ్చాక ఆ పెంచిన జీతాలనే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం వండే అయాలు ఇలా అందరికీ పెంచిన జీతాలే ఇచ్చామని తెలిపారు.
CM Jagan Fake Propaganda on State Progress: "వేదికేదైనా.. అలవోకగా అబద్ధాలు". ఇదీ మన ముఖ్యమంత్రి తీరు
CM Jagan Praise the Employees: కొవిడ్ తరువాత రాష్ట్ర ఆదాయాలు పడిపోయినా.. ఉద్యోగులకు వేతనాలు చెల్లించామని గుర్తు చేశారు. అలాగే పేదలకు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేశామని.. అది ఉద్యోగుల వల్లే సాధ్యం అయ్యిందని కొనియాడారు. ఎవరూ ఊహించని గడ్డు కాలం ఎదురైన పరిస్థితిలో కలిసి కట్టుగానే ఎదుర్కొన్నామన్నారు. గతంలో వదిలేసిన కారుణ్య నియామకాలు, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేసే అంశాలు ఇలా నిర్ణయం ఏదైనా ఉద్యోగులకు మేలు చేశామని వివరించారు. 16 శాతం డీఏ, నష్టాల్లో ఉన్న ఆర్టీసీనీ కాపాడంలో ప్రభుత్వం ముందు ఉందని తేల్చిచెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు.
CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన
Jagan Comments on Out Sourcing Employees: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్కాస్ విధాన్లో నియామకాలు చేశామన్నారు. ప్రతి సందర్భంలోనూ ఉద్యోగులకు మంచి చేశామని తెలిపారు. ఒత్తిడి తగ్గించేదుకు ప్రభుత్వ వ్యవస్థల్ని విస్తరించామన్నారు. గ్రామ స్థాయిలో ఇప్పుడు చాలా ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలు వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వ బడులు మెరుగు పరిచామని.. వైద్య, రవాణా ఇలా అన్ని బాగుంటేనే ప్రజలు, ఉద్యోగులు బాగుంటారని,.. లేకపోతే చంద్రబాబు లాంటి వ్యక్తులు వాటిని మూయించే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. గతంలో పెద్ద జిల్లాకు ఒక కలెక్టర్, ఎస్పీ బాధ్యతలు చూసుకోవాల్సి వచ్చేదని.. ఇప్పుడు 26 జిల్లాలకు అధికారులు, గ్రామస్థాయిలో పాలన అందిస్తున్నారన్నారు.
CM JAGAN REVIEW ON HIGHER EDUCATION: 3295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.. 23న నోటిఫికేషన్
CM Jagan Announced DA: దసరా పండుగ నాడు ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తామని వెల్లడించారు. ఉద్యోగులు అడిగిన అన్ని అంశాలు ఇవ్వలేకపోవచ్చు కానీ.. ప్రభుత్వం ఉద్యోగులదే అని భావించాలని జగన్ సూచించారు. అదే సమయంలో చంద్రబాబుపైనా విమర్శలు సంధించారు. ఉద్యోగులను తొలగించి వారికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. 2004 వరకూ 9 ఏళ్ల పాటు 54 ప్రభుత్వ రంగ సంస్థలు ముసేయించారని చెప్పారు.
Sajjala Ramakrishna Reddy Comments on Employees: సీఎం జగన్ ఆలోచనా విధానానికి అనుగుణంగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉద్యోగులను భావించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం దిశా నిర్దేశంతో పని చేసిన వాళ్లమే తామంతా అని అన్నారు. పథకాలు అమలు చేసేది ఉద్యోగులే అని సీఎం జగన్ విశ్వాసమని తెలిపారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని అంశాలు .. నేడు పరిష్కారం అయ్యాయన్నారు. కరోనా కాలంలో ప్రభుత్వం ముందుకు కదిలింది అంటే అది ఉద్యోగుల వల్లేనని స్పష్టం చేశారు. కొవిడ్ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బ తీసిందని, ఉద్యోగుల సహకారం ఏ అంశంలోనూ సీఎం జగన్ మర్చిపోలేదని తెలిపారు. ఉద్యోగుల నమ్మకాన్ని కూడా కలిగిన నాయకుడు మంచి పాలన అందిస్తాడని తెలిపారు.
CM Jagan Review: లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం.. మౌలిక సదుపాయాలలో రాజీ పడొద్దు: సీఎం జగన్