CM Jagan, RTC MD on Vijayawada Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు 12వ ప్లాట్‌ఫాం మీదికి వేగంగా దూసుకురావడంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో బస్టాండ్‌లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ తిరుమలరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం తరుఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సీఎం జగన్ ఆర్థిక సాయం ప్రకటించగా.. ఆర్టీసీ నుంచి రూ.5 లక్షల చొప్పున ఎండీ తిరుమలరావు పరిహారం ప్రకటించారు.
అసలు ఏం జరిగిందంటే..విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సోమవారం ఓ ఆర్టీసీబస్సు బీభత్సం సృష్టించింది. బస్టాండ్‌లోని 12వ ప్లాట్‌ఫాం మీదికి వేగంగా దూసుకొచ్చింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొంతమంది ప్రయాణికులు బస్సు చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని..క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
బస్టాండ్‌లో ఫ్లాట్ఫాంపైకి దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు - విద్యార్థులు ఉండగా కాల్వలో బోల్తాపడిన స్కూల్ బస్
RTC MD Tirumala Rao Comments: ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ తిరుమలరావు మాట్లాడుతూ..''విజయవాడ బస్టాండ్‌లో ఈరోజు జరిగిన ప్రమాదం దురదృష్టకరం. బస్సు బయల్దేరే ముందు ఈ ప్రమాదం జరిగింది. బస్సులో అప్పటికే 24 మంది ప్రయాణికులు ఎక్కారు. ఈ ఘటనలో ప్రయాణికురాలు కుమారి మృతి చెందారు. ఆమెతోపాటు ఆర్టీసీ బుకింగ్ క్లర్క్ వీరయ్య చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ నుంచి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటిస్తున్నాం. సురేష్ బాబు, సుకన్య అనేవారికి గాయాలయ్యాయి. 24 గంటల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.'' అని ఆయన అన్నారు.
RTC MD on RTC Bus Driver: విజయవాడ బస్టాండ్‌లో జరిగినప్రమాదానికి సంబంధించి రెండు రకాల కారణాలు వినిపిస్తున్నాయని.. ఆర్టీసీ ఎండీ తిరుమలరావు అన్నారు. మానవ తప్పిదమా..?, లేక ప్రమాదమా..? అనేది విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. 24 గంటల్లో విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌కు 62 ఏళ్లు అని ఎండీ తిరుమలరావు తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ విధులకు వచ్చారన్నా ఆర్టీసీ ఎండీ.. ప్రమాదానికి గురైన బస్సు కండిషన్‌లోనే ఉందని వివరించారు. కాలం చెల్లిన బస్సులు తొలగిస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసీలో 15 ఏళ్లు దాటిన 232 బస్సులను తొలగించి, కొత్త బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు పెట్టామని ఆర్టీసీ ఎండీ తిరుమలరావు వివరించారు.
బ్రిడ్జ్ పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు- నలుగురు మృతి
CM Jagan on Vijayawada Bus Accident: విజయవాడ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్లాట్‌ఫాంలోని ప్రయాణికులపైకి దూసుకురావడం దురదృష్టకరమన్నారు. ప్లాట్‌ఫాం నంబర్ 12 వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. అనంతరం బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం జగన్.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.
''విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఉన్నట్లుండి ప్లాట్‌ఫాంలోని ప్రయాణికులపై అతివేగంతో దూసుకొచ్చింది. బస్సు చక్రాల కింద పడి ముగ్గురు బలవ్వగా, మహిళతో పాటు బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రమాదం ధాటికి ప్రాంగణంలోని బారికేడ్లు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. దుకాణాల్లోకి కూడా దూసుకెళ్లడంతో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. బ్రేక్ పడకపోవడం వల్లే బస్సు దూసుకొచ్చింది.''-దుకాణదారులు, విజయవాడ బస్టాండ్
ఎదురుగా వస్తున్న వాహానాన్ని తప్పించబోయి, కాలువలోకి దూసుకెళ్లిన బస్సు! పల్నాడు జిల్లాలో ఘటన