ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరం నియోజకవర్గంలో వర్గపోరుపై దృష్టి సారించిన సీఎం జగన్‌

‌‍‍‌CM Jagan focused on Mylavaram constituency: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వర్గపోరుపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది మంత్రి జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీకి పావులు కదుపుతున్నారు. ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్గపోరు రచ్చకెక్కగా నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

‌‍‍‌CM Jagan focused on Mylavaram constituency
మైలవరం నియోజకవర్గంలో వర్గపోరుపై దృష్టి సారించిన సీఎం జగన్‌

By

Published : Dec 15, 2022, 11:34 AM IST

‌‍‍‌CM Jagan focused on Mylavaram constituency: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వర్గపోరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న మంత్రి జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు.

నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్​కు సీటు ఉండదన్నట్లుగా కొందరితో సోషల్ మీడియాలో కొందరు విస్తృతంగా ట్రోల్ చేశారు. దీంతో ఇటీవల ఇరువురి మధ్య వర్గపోరు పెరిగి రచ్చకెక్కింది. దీంతో ఇరువురినీ పిలిచిన పార్టీ ముఖ్యనేతలు మాట్లాడారు.

దీంతో ఈ రోజు మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం చెప్పి అభ్యర్థిని సీఎం జగన్ ప్రకటిస్తున్నారు.

ఇవాల్టి సమావేశంలో అభ్యర్థి ప్రకటన ఉంటుందా అనే ఉత్కంఠ కార్యకర్తలు, నేతల్లో నెలకొంది. వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి ఎవరు బరిలో ఉంటారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కృష్ణప్రసాద్​ను మరోసారి బరిలో నిలుపుతారా లేక జోగి రమేష్ వైపు సీఎం మొగ్గు చూపుతారా అనే విషయమై స్పష్టత రానుంది. ఇవాల్టి సమావేశంపై నియోజకవర్గం సహా జిల్లా కేడర్ లో ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details