CM Jagan Cheating Farmers :నాలుగున్నరేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీని పెంచేందుకు సీఎం జగన్(CM Jagan)కు చేతులు రావడం లేదు. తిత్లీ తుపాను (Titli Cyclone) సమయంలో దెబ్బతిన్న అరటి, జీడిమామిడి, మామిడి తోటలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం (TDP Government)ఎకరాకు 12వేల చొప్పున పెట్టుబడి రాయితీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎకరాకు 9 వేలు మాత్రమే ఇస్తామంటున్నారు. ఈమొత్తాన్నీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే.
Farmers Problems in YSRCP Government :కొబ్బరి చెట్టుకు 1,500 చొప్పున సాయం అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయిస్తే.. కాదు మేం అధికారంలోకి వచ్చాక 3వేలు, జీడిమామిడికి ఎకరాకు 20 వేలు ఇస్తామనిజగన్ హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా 2019లో ఉత్తర్వులు సైతం ఇచ్చారు. కానీ ఈ ఏడాది నవంబరు 14న జారీ చేసిన ఉత్తర్వుల్లో కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరిహారంలో పూర్తిగా కోత విధించారు. చెట్టుకు 1,000, జీడిమామిడికి ఎకరాకు 9 వేలే పరిహారంగా నిర్ణయించారు.
మాయదారి రోగం - లబోదిబోమంటున్న మిర్చి రైతులు
YSRCP Government Not Increasing Investment Subsidy For Farmers :రైతులకు పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో తేడా కనిపిస్తోంది. విపత్తు నిబంధనల ప్రకారం కేంద్రం ఇచ్చే సాయం తక్కువగా ఉండటంతో దాన్ని పెంచాలని 2014లో అప్పటి సీఎం చంద్రబాబు (Ex CM Chandrababu) ఆదేశించారు. హుద్‌హుద్ తుపాను (Hudhud Cyclone) సమయంలోనే తన నిర్ణయాన్ని అమలు చేశారు. 2018 తిత్లీ సమయంలో మరింత ఉదారత ప్రదర్శించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక.. వాటిని పెంచలేదు సరికదా.. మరింత తగ్గించింది. తిత్లీ సమయంలో ఎకరా వరికి 8వేల పెట్టుబడి సాయమిస్తే.. వైసీపీ మాత్రం ఎకరాకు 6 వేల 800 మాత్రమే ఇస్తామంటోంది. 2018 తిత్లీ తుపాను సమయంలో వరికి ఎకరాకు 8 వేలు అందించారు. అరటి, జీడిమామిడి, మామిడి, కొబ్బరి చెట్లకు సాయాన్నీ పెంచారు. వీటన్నింటికీ జగన్ ప్రభుత్వం కోత పెట్టింది.