హైదరాబాద్ వనస్థలిపురంలో రాజు అనే ఇన్‌స్పెక్టర్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి వనస్థలిపురం పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో కారులో ఓ యువతితో ఏకాంతంగా సీఐ ఉండటాన్ని చూసిన భార్య ఇద్దరు పిల్లలతో అక్కడికి వెళ్లి గొడవపెట్టుకుంది. ఇది గమనించిన పోలీసులు.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సీఐ రాజు ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసి.. సెల్‌ఫోన్ పగులగొట్టాడు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చిన కానిస్టేబుళ్లు మరో పోలీస్ వాహనంలో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాదులో పనిచేస్తున్న సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ రాజు ఇన్‌స్పెక్టర్‌ని రెడ్ హ్యాండెడ్‌గా భార్య పట్టుకుంది. ఇన్‌స్పెక్టర్ రాజు మద్యం మత్తులో వనస్థలిపురం కానిస్టేబుళ్లపై దాడి చేయడంతో కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో సీఐపై చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్స్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.
ఈ మేరకు సీఐ రాజుపై 353, 332, 427 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్‌గా 10 రోజుల క్రితమే హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ కాగా ఇంకా జాయిన్ కాలేదు. నిన్నటి వరకు మునుగోడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ రాజు... ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం సీఐ రాజును వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు.