CM Jagan Meeting With YSRCP Leaders: ప్రతీ ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తోందని అన్ని నియోజకవర్గాల్లో వైకాపా గెలుపు కష్టమేమీ కాదని ముఖ్యమంత్రి జగన్ పునరుద్ఘాటించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. లంచాలు, వివక్షకు తావులేకుండా పరిపాలన సాగుతోందని జగన్ చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చాకే ప్రజల ఆశీస్సులు కోరుతున్నామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో 175సీట్లు ఎందుకు రావని ప్రశ్నించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలున్నా.. వాటిని పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆదేశించారు. నేతలు, కార్యకర్తలు అందరూ కచ్చితంగా ప్రతి గడపకూ వెళ్లాలని.. చేస్తున్న పనులను ప్రజలకు వివరించాలన్నారు.
నేతలు విభేదాలన్నీ పక్కనపెట్టి.. కలిసికట్టుగా పని చేయాలి: సీఎం జగన్ - YSRCP
CM Jagan Meeting: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా నేతలతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98 శాతం నేరవేర్చమని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
"175 కు 175 నియోజకవర్గాలు ఎందుకు రాకూడదు అని టార్గెట్తో ముందుకు అడుగులు వేయాల్సిన.. పరిస్థితిని గుర్తుకు చేసేందుకు మిమ్మల్ని ఇక్కడికి పిలిచాము. 175 సీట్లు టార్గెట్ అనుకున్నవి సాధ్యం కానీ పని కాదు. కారణం ప్రతీ ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తోంది. పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. ప్రతీ ఇంటికీ మేలు, మంచి జరుగుతోంది." -ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇవీ చదవండి: